Site icon NTV Telugu

Asian Champions Trophy: భారత హాకీ కొత్త గోల్ కీపర్‭గా బహదూర్ పాఠక్..

Asian Champions Trophy 2024

Asian Champions Trophy 2024

Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. PR శ్రీజేష్ రిటైర్మెంట్ తర్వాత, క్రిషన్ బహదూర్ పాఠక్‌ ను ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన గోల్ కీపర్‌గా నియమించారు. హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నీలో ఆసియాలోని టాప్ హాకీ ఆడే దేశాలు భారత్, కొరియా, మలేషియా, పాకిస్థాన్, జపాన్, ఆతిథ్య చైనాలు తలపడనున్నాయి.

ఇక ప్రకటించిన భారత పురుషుల హాకీ జట్టు చూస్తే..

* గోల్ కీపర్లు: క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.

* డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్ , జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్ మరియు సుమిత్.

* మిడ్‌ఫీల్డర్లు : రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్, మన్‌ప్రీత్ సింగ్ మరియు మహ్మద్ రహీల్.

* ఫార్వర్డ్: అభిషేక్, సుఖ్జిత్ సింగ్, అరిజిత్ సింగ్ హుండాల్, గుర్జోత్ సింగ్ ఎయిర్ ఉత్తమ్ సింగ్ (జూనియర్ జట్టు కెప్టెన్)

ప్యారిస్ ఒలింపిక్స్‌ లో కాంస్య పతకం సాధించిన తర్వాత టీంకి శ్రీజేష్ హాకీకి వీడ్కోలు పలికాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాఠక్ స్టాండ్‌ బై గోల్‌ కీపర్‌ గా ఉన్నాడు.

Exit mobile version