Site icon NTV Telugu

Modi – Meloni: మెలోని ఆత్మకథకు మోడీ ముందుమాట..

Giorgia Meloni

Giorgia Meloni

Modi – Meloni: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాధినేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితులనే విషయం తెలిసిన విషయమే. తాజాగా ఇటాలియన్ ప్రధాన మంత్రి మెలోని జీవిత్ర చరిత్ర “ఐ యామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపల్స్” కు మోడీ ముందుమాట రాశారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తన రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” శీర్షిక నుంచి ప్రేరణ పొందిన పుస్తకం ఇది అని ఆయన తెలిపారు. రూపా పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుంది. జార్జియా మెలోని ఆత్మకథ భారతీయ ఎడిషన్ త్వరలో దేశంలో అందుబాటులోకి రానుంది.

READ ALSO: Anakapalli : హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకొని, వ్యతిరేకంగా నినాదాలు

ఇది నాకు దక్కిన గౌరవం: మోడీ
ఈ ప్రత్యేక పుస్తకానికి ముందుమాట రాయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ముందుమాటలో ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని దేశభక్తురాలిగా, అత్యుత్తమ సమకాలీన నాయకురాలిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. పుస్తకం ముందుమాటలో గత 11 ఏళ్లుగా తాను అనేక మంది ప్రపంచ నాయకులను కలిశానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం కాలంతో సంబంధం లేని సత్యాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుంది’’ అని వివరించారు. భారతదేశంలో ప్రజలు ఆమెను ఒక అద్భుతమైన సమకాలీన రాజకీయ నాయకురాలిగా, దేశభక్తి స్ఫూర్తికి ఉదాహరణగా చూస్తారని చెప్పారు. సాంస్కృతిక వారసత్వం, సమానత్వంపై ఆమెకు అమితమైన విశ్వాసం ఉందని కొనియాడారు.

జార్జియా మెలోని ఆత్మకథ అసలు వెర్షన్ 2021 లో రాశారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రతిపక్ష నాయకురాలు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. 2025 జూన్‌లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు ఈ బుక్‌కు ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో మెలోనీ తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా, అవివాహితురాలైన తల్లిగా ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు.

READ ALSO: Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్!

Exit mobile version