Site icon NTV Telugu

Double ismart : డబుల్ ఇస్మార్ట్ కోసం మెలోడీ బ్రహ్మ వచ్చేసాడు గా..

Whatsapp Image 2023 11 24 At 4.25.56 Pm

Whatsapp Image 2023 11 24 At 4.25.56 Pm

టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని రీసెంట్‌గా స్కంద సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్‌ షూటింగ్ తో రామ్ బిజీ అయిపోయాడు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రం పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ పై తెరకెక్కుతుంది.. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు.డబుల్‌ ఇస్మార్ట్ ఈజ్‌ బ్యాక్‌.. అంటూ రామ్‌ సెట్స్‌లో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్‌తోపాటు ఇప్పటికే లొకేషన్‌ నుంచి రిలీజ్ చేసిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా చాలా రోజుల క్రితమే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలు కాగా ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరనేది మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్‌లో పెడుతూ వచ్చింది..

తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది..ఇస్మార్ట్ శంకర్ మూవీకి అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి సినిమా విజయంలో కీలక పాత్ర వహించారు మణిశర్మ.. ఇక డబుల్ ఇస్మార్ట్ మూవీ కి కూడా మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. తాజాగా పూరీ, మణిశర్మ, చార్మీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ కోసం మణిశర్మ వచ్చేసారు అంటూ మేకర్స్ విషయాన్ని తెలియజేశారు.. ఇస్మార్ట్ శంకర్‌ను మించిన ఆల్బమ్‌ రెడీ అవుతుందని పూరీ టీం తెలియజేసింది.డబుల్‌ ఇస్మార్ట్ మూవీ 2024 మార్చి 8న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే రామ్‌ మరోవైపు పాపులర్ బ్యానర్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ కు డబుల్ ఇస్మార్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

https://x.com/ramsayz/status/1727934069785198872?s=20

Exit mobile version