NTV Telugu Site icon

SPY : స్పై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్న మెగాస్టార్..?

Whatsapp Image 2023 06 25 At 7.03.06 Pm

Whatsapp Image 2023 06 25 At 7.03.06 Pm

నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కంటెంట్ బేస్డ్ సినిమాలతో హిట్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు నిఖిల్.తాజాగా నిఖిల్ గ్యారీ బి.హెచ్ డైరెక్షన్ లో ‘స్పై’ అనే సినిమాను చేశాడు.ఈ సినిమా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.ఇటీవలే ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీని ఛేదించే కథాంశంతో తెరకెక్కించినట్లు సమాచారం.

ఇక ట్రైలర్ లో వచ్చే యాక్షన్ సీన్లు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక వున్న మిస్టరీని కనుగొనే స్పై పాత్రలో నిఖిల్ నటించినట్లు సమాచారం..ఈ ట్రైలర్ ఎండింగ్ లో స్వతంత్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు,లాక్కునేది. ఇది నేను చెప్పింది కాదు నేతాజీ చెప్పింది అని నటుడు రానా చెప్పిన డైలాగ్ హైలైట్ గా మారింది.. కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టిన నిఖిల్ ఇప్పుడు స్పై సినిమాతో మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నాడు.. ట్రైలర్ చూసినాక సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు కూడా సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు బోస్ మిస్టరీని ఛేదించే విధానాన్ని చక్కగా చూపించారని వారు తెలిపారు.. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ వీలైనంత మేరకు సినిమాను ప్రమోట్ చేయటానికి భారీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నెల 27న హైదరాబాద్లో ‘స్పై’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తుంది..ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి నిఖిల్ తో ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

Show comments