Chiranjeevi: కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగం, డీప్ ఫేక్ (Deepfake) వీడియోల బెడదపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారుల గౌరవం, గుర్తింపును కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ఈ సమస్యను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన వినతిపత్రం సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకు హైదరాబాద్ కు వచ్చిన సమయంలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా.. ఆయన సూచన మేరకు కేంద్ర హోంశాఖ మరియు సమాచార, ప్రసార శాఖలకు ఉద్దేశించిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసినట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి కొందరు దుండగులు నటీనటులు, కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వీడియోలను సృష్టిస్తున్నారని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతినడంతో పాటు, నటుల హక్కులు, వారి క్రియేటివ్ కంటెంట్‌కు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. డీప్ ఫేక్‌లు, డిజిటల్ ఇంపర్సనేషన్ వంటి దుశ్చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని చిరంజీవి కోరారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే బాధ్యులపై కఠిన శిక్షలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిస్టుల గౌరవం, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి భద్రతకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత అని చిరంజీవి స్పష్టం చేశారు.
Following my recent meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji and as advised by him, I have submitted a memorandum to Union Minister Shri @kishanreddybjp garu, addressed to the Union Home Ministry and the Ministry of Information & Broadcasting, seeking stronger safeguards against AI misuse, deepfakes and digital impersonation.
Grateful to Shri Kishan Reddy garu for his assurance to coordinate with the concerned ministries and take these concerns forward.
Protecting the dignity, identity and creative rights of artists, alongside the safety of every citizen, is a shared responsibility.
Technology should enhance creativity, not destroy dignity.
#UniteAgainstDigitalAbuse— Chiranjeevi Konidela (@KChiruTweets) November 16, 2026

