Site icon NTV Telugu

Surya Birthday : సూర్యకు చిరంజీవి స్పెషల్‌ విషెస్‌..

Chiranjeevi Surya

Chiranjeevi Surya

Megastar Chiranjeevi Special Birthday Wishes to Surya.

తమిళ స్టార్‌ హీరో సూర్య పుట్టనరోజు నేడు. అయితే ఆయన సోషల్‌ మీడియా వేదికగా సినీ ప్రముఖులు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం సూర్య జరుపుకుంటున్న పుట్టినరోజు ప్రత్యేకం. ఎందుకంటే.. నిన్ననే జాతీయ ఉత్తమ నటుడిగా సూర్యకు అవార్డు దక్కంది. మరుసటి రోజే ఆయన పుట్టిన రోజు ఉండటం ఆయనకు సంతోషం కలిగించిందనే చెప్పాలి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో భాగంగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డుకు సూర్య‌ను ఎంపిక చేశారు. డెక్కన్ ఎయిర్‌వేస్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ గోపినాథ్ బ‌యోగ్ర‌ఫీ ఆధారంగా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా)లో టైటిల్ రోల్ పోషించిన సూర్య‌కు ఈ అవార్డు ద‌క్కింది.

 

అయితే.. శ‌నివారం సూర్య జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ బ‌ర్త్ డే మీకు నిజంగానే ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని చిరు గుర్తు చేశారు. పుట్టిన రోజు నాడే జాతీయ అవార్డుకు ఎంపిక కావ‌డం అరుద‌ని, అలాంటి అరుదైన అవ‌కాశం మీకు ద‌క్కిందంటూ సూర్య‌కు చిరు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు చిరంజీవి. ఇలాంటి మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని, మ‌రిన్ని అవార్డులు మీ కోసం ఎదురు చూస్తున్నాయంటూ సూర్య‌కు చిరు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు మెగస్టార్‌. ఈ సందర్భంగా బ్యాక్ డ్రాప్‌గా త‌న ఫొటో ఉన్న పెయింటింగ్ ముందు సూర్య నిలుచున్న‌ట్లుగా ఓ ఫొటోను చిరు పోస్ట్ చేశారు.

Exit mobile version