NTV Telugu Site icon

Chiranjeevi : పిఠాపురం ప్రచారంపై స్పందించిన మెగాస్టార్..

Whatsapp Image 2024 05 10 At 2.30.58 Pm

Whatsapp Image 2024 05 10 At 2.30.58 Pm

మెగా స్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించిన విషయం తెలిసిందే..తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. మే 9 న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా చ్రతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.అవార్డు ప్రధానోత్సవం ముగిసాక కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్ పార్టీలో మెగాస్టార్ తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.అక్కడదిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

తాజాగా చిరంజీవి కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..తన సేవలు గుర్తించి కేంద్రం ఈ అవార్డు ప్రధానము చేయడం ఎంతో సంతోషంగా వుంది.ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం తన అభిమానులని చిరంజీవి తెలిపారు .వారు చూపిన ప్రేమాభిమానాల వల్లే తనకి ఈ అవార్డు లభించిందని ఆయన అన్నారు.ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కు మద్దతుగా తాను పిఠాపురం ప్రచారానికి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చిరణజీవి తెలిపారు .తాను ప్రచారానికి వెళ్లట్లేదని ఆయన తెలిపారు .

Show comments