Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను కొనియాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. “సినిమాలో ఫైట్ కంపోజిషన్స్, మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. సాధారణంగా క్రికెట్ లాంటి ఆటలైతే ఏదో ఒక గిమిక్ చేసి మేనేజ్ చేయొచ్చు. కానీ కుస్తీ (రెజ్లింగ్) బ్యాక్‌డ్రాప్ అనేసరికి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ముఖ్యం. దానికోసం చరణ్ పడ్డ కష్టం ఓవర్‌నైట్ వచ్చింది కాదు. ప్రతిరోజూ వాడు పడ్డ శ్రమను నేను కళ్లారా చూశాను. ఉదయం 5 గంటలకే లేచి, 6 నుండి 7 వరకు వర్కౌట్స్ చేసి, ఆ తర్వాతే సెట్స్‌కి వచ్చేవాడు. మళ్లీ రాత్రి షూటింగ్ ముగించుకుని ఎంత అలసిపోయి వచ్చినా.. కాస్త సూప్ తాగి మళ్లీ జిమ్ కి వెళ్ళిపోయేవాడు.” అని చరణ్ డెడికేషన్‌ను గుర్తుచేసుకున్నారు.
Also Read
“మరో విశేషం ఏంటంటే.. చరణ్ స్వామి మాల వేసుకోవడం వల్ల దాదాపు 70 రోజులు పూర్తి వెజిటేరియన్ డైట్ లోనే ఉన్నాడు. రెజ్లర్ బాడీ కోసం హై ప్రోటీన్ కావాలి, కానీ నాన్-వెజ్ తినకూడదు. ఆ స్థితిలో వాడు ట్రెడ్మిల్ పై, జిమ్ లో పడ్డ కష్టం చూసి.. ‘అబ్బా! ఒక సినిమా కోసం ఇంత అవసరమా? ఇంత రిస్క్ చేయాలా?’ అనిపించేది. వాళ్ళ అమ్మ (సురేఖ) అయితే.. ‘ఇంత కష్టపడుతున్నాడు, భగవంతుడా ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. ఒకవేళ జనాలు దీన్ని ఆమోదించకపోతే వాడు తీవ్రంగా నిరాశకు గురవుతాడు’ అని దండం పెట్టుకుంటూ కోరుకునేది. కానీ ఈరోజు ‘పెద్ది’ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఓపెన్ హార్ట్‌తో యాక్సెప్ట్ చేసి, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. హాట్సాఫ్ చరణ్” అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు.
ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు నచ్చిన ఒక బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. “ట్రైన్ సీన్ లో చరణ్ లెగ్ పెట్టడానికి ముందు, ఫ్రేమ్ లోకి వచ్చి నిలబడినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నా ఫేవరెట్. కళ్ళు మూసే ముందు శూన్యంలోకి అలా ప్లెయిన్ గా చూస్తూ సినిమాలో లీనమైపోయాడు. ఆ షాట్ చూసినప్పుడే థియేటర్లలో క్లాప్స్ పడతాయని నాకు అర్థమైంది” అని ప్రశంసించారు. డైరెక్టర్ బుచ్చిబాబును అభినందిస్తూ.. ఈ తరం జనరేషన్‌ను ఇన్స్పైర్ చేయడానికి ఈ కథను ఎంచుకోవడం గొప్ప విషయమన్నారు. “ఇప్పుడున్న కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కేవలం మార్కులు, ర్యాంకులు తప్ప పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. స్కూల్ అంటే కేవలం నాలుగు గోడలు, బ్లాక్ బోర్డ్ కాదు.. దాని వెనకాల ఒక ప్లేగ్రౌండ్ కూడా ఉండాలి. అమ్మ కడుపులో ఉన్న తొమ్మిది నెలలు ఆడుకున్న పిల్లలకి, బయట ప్రపంచంలో ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకుండా బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. గ్యాడ్జెట్స్ చేతిలోకి వచ్చాక పిల్లలు ఆటలకి దూరమవుతున్నారు. ఒకప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు మెల్లగా మారుతున్నా, ఇంకా మార్పు రావాలి.” అని చిరు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?