బ్రిటన్‌లో తాజాగా జరిగిన ఎన్నికల సర్వేలో అధికార ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 100 పార్లమెంట్ స్థానాలు కూడా దక్కవని పేర్కొంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 468 సీట్లు గెలుచుకుని.. 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Chicken prices: కొండెక్కిన చికెన్ ధరలు.. తగ్గిన గుడ్డు రేటు
బెస్ట్ ఫర్ బ్రిటన్ తరఫున సర్వేషన్ సంస్థ ఇటీవల ఎన్నికల సర్వే నిర్వహించింది. 15,029 మందితో తాజాగా సర్వే జరిపింది. ఇందులో పాల్గొన్న వారిలో 45 శాతం మంది ప్రతిపక్ష లేబర్ పార్టీకే ఓటేశారు. పాయింట్ల వారీగా చూస్తే అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ 19 పాయింట్లు ముందంజలో ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో చేపట్టిన పోలింగ్‌తో పోలిస్తే ఇది మూడు పాయింట్లు ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: CM YS Jagan: కదిరిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
సివిల్ సొసైటీ ప్రచార సంస్థ విడుదల చేసిన కొత్త మెగా పోల్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలక కన్జర్వేటివ్ పార్టీ భారీ పరాజయం పాలవుతుందని సూచిస్తుంది. నార్త్ యార్క్‌షైర్‌లోని బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని సూచించింది.
ఇది కూడా చదవండి: BJP Manifesto: మేనిఫెస్టో కసరత్తుపై కీలక అప్‌డేట్ ఇదే!