Site icon NTV Telugu

Peddi : మెగా పవర్ స్టార్ ‘ పెద్ది’ చికిరి వీడియో సాంగ్ రిలీజ్

Ram Charan

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 27 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది పెద్ది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చక చక చేసేస్తున్నారు. ఇటీవల  శ్రీలంకలో భారీ యాక్షన్ సీన్స్ ఫినిష్  చేసుకుని వచ్చాడు బుచ్చిబాబు. కాగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి వీడియో సాంగ్ ను ను కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. దసరా కానుకగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ కావాల్సిన ఫస్ట్ సింగిల్ అనేక వాయిదాల అనంతరం ఈ రోజు విడుదలైంది. లిరిసిస్ట్ బాలాజీ రాసిన ఈ సాంగ్ ను మోహిత్ చౌహన్ ఆలపించారు. ఏమాటకామాట సాంగ్ లో చరణ్ వేసిన హుక్ స్టెప్ అదిరింది. క్రికేట్ బ్యాట్ తో చరణ్ మాస్ స్టెప్స్ వేశాడు. ఇక జాన్వీ కపూర్ తన అంద చందాలతో నర్తించి మెప్పించింది. చూస్తుంటే చికిరి గట్టిగానే వినిపించే సాంగ్ లా ఉంది.

Exit mobile version