NTV Telugu Site icon

Chiranjeevi: లాస్ ఏంజిల్స్‌లో ‘మెగాస్టార్’ చిరంజీవికి ఘన సన్మానం!

Chiranjeevi Us Fans

Chiranjeevi Us Fans

Chiranjeevi Was Honored in Los Angeles for Padma Vibhushan Award: కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించగా.. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా ఘనంగా సన్మానించారు.

Also Read: Jio New Plan 2024: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్‌.. అదనపు డేటా, 14 ఓటీటీలు ఫ్రీ!

అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ‘పద్మ విభూషణ్’ గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి.. శాలువాలతో చిరుకి తెలుగు ఫాన్స్, మెగా ఫాన్స్ సన్మానం చేశారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. తనపై కురిపిస్తున్న ఈ ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.