మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్ళీ తన చార్మ్ కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఈ ఏడాది ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగాస్టార్ కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంటారని అనేక రూమర్స్ వచ్చాయి. కానీ సినీ ఇండస్ట్రీ లో జయాపజయాలు సహజమని తెలిసిన మెగాస్టార్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు.మెగా స్టార్ చిరంజీవి నేడు (ఆగష్టు 22) 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ నుంచి ఒక శుభవార్తను ఫ్యాన్స్ కోసం వెల్లడించారు.
సుష్మిత నిర్మాతగా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందుకు సంబంధిచిన ఒక ఫోటోను వారు షేర్ చేయడం జరిగింది.. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి చిరంజీవికి వినిపించారని సమాచారం.. ఆ కథను ఆయన ఫైనల్ కూడా చేశారని తెలుస్తుంది.. ఇకపోతే ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను ఒక యంగ్ డైరెక్టర్ కు ఇవ్వనున్నట్లు సమాచారం..ఇప్పటికే యూవీ క్రియేషన్స్ నుంచి ఒక సినిమా ఉంటుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. వారు ఒక పోస్టర్‌ను కూడా తాజాగ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. దీంతో భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ రెండు భారీ సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని ఈ సందర్బంగా అభిమానులు మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
https://twitter.com/GoldBoxEnt/status/1693835861912416621?s=20
