NTV Telugu Site icon

Bjp Meeting: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల భేటీ.. పార్టీ బలోపేతంపై చర్చలు..!

Bjp

Bjp

Bjp Meeting: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా టీ- బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో పార్టీ బలోపేతంపైనే సమావేశం అయినట్లు తెలుస్తోంది.

Rea Also: Netherlands: బీచ్‌లో సెక్స్‌.. నెదర్లాండ్స్‌లోని ఓ పట్టణంలో వ్యతిరేకంగా ప్రచారం..

మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రచారంపై రాష్ట్రంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మాజీ మంత్రులు ఈటల రాజేందర్ లేదా డికె అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు బిజెపి పెద్దలు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యత ఏర్పడింది.

Rea Also: Crime News: వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య. గొంతుకోసి.. ఆపై స్కూడ్రైవర్ తో కళ్లు చిద్రం

మరోవైపు అధ్యక్ష మార్పు ప్రచారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఇతర పార్టీలు చేసే వదంతులను బిజెపి క్యాడర్ నమ్మవద్దని సూచించారు. ఏదయినా వుంటే బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. పార్టీ లైన్ లోనే వుంటూ బిజెపి బలోపేతానికి పనిచేస్తున్నానని… పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తనను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. బిజెపిని బలహీనపర్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీకయ్యే అవకాశాలు వుండవని… గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బిజెపి నుండి లీకులు లేవని సంజయ్ అన్నారు.