NTV Telugu Site icon

Uttar Pradesh: ఈ పోలీసులకు అవార్డ్ ఇవ్వాల్సిందేనయ్యా.. వాళ్లే బైక్ లో గన్ పెట్టి వాళ్లే అరెస్ట్ చేశారుగా

Police

Police

సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా ఇరిక్కించాలి అనుకుంటే పోలీసులే వాళ్లింట్లో డ్రగ్స్, గన్స్ పెట్టి వెంటనే వచ్చి సెర్చ్ అంటూ ఇళ్లంతా వెతికేయడం తరువాత వారిని అరెస్ట్ చేయడం లాంటి సీన్లు చూస్తుంటాం. తరువాత వాళ్ల మీద కసినంతా తీర్చుకుంటారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. అయితే వీళ్లు డ్యూటీ కంటే సినిమాలు ఎక్కువ చూస్తారేమో..అందుకే పాపం పక్కాగా ప్లాన్ చేయలేక పట్టుబడిపోయారు. ఎలా ఇరికించాలో నేర్చుకున్నారు కానీ దాని వల్ల మేం కూడా ఇరుక్కుంటాం అని ఆలోచించలేకపోయారు. వాళ్లే కనుక డ్యూటీ కూడా సరిగ్గా చేస్తున్నట్లయితే పోలీసు బుర్రాతో కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని ఫస్టే చూసేవారు కానీ వారు అవేవి పట్టించుకోకుండా అడ్డంగా దొరికిపోయారు.

Also Read: GST: గూగుల్, ఫేస్‌బుక్, ఎడ్ టెక్ కంపెనీలకు కేంద్రం షాక్.. 18శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే

అసలు విషయంలోకి వెళితే కొంతమంది పోలీసులు ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఉంటున్న అజిత్ త్యాగి అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. కొంతమంది వారి ఇంట్లోకి వెళ్లగా కొంతమంది పోలీసులు అతడి బైక్ దగ్గరకు వెళ్లి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నావంటూ నానా హడావిడి చేసి ఈ నెల 26న అరెస్ట్ చేశారు. తరువాత అజిత్ కుటుంబ సభ్యులు అసలు బైక్ లోకి గన్ ఎలా వచ్చింది అని అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ రికార్డు అయిన ఫుటేజీని చూసి వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే పోలీసులే ఇంటి డోర్ కొట్టే ముందు బైక్ లో తుపాకీ కొట్టారు. తరువాత వారిని బయటకు పిలిచి ఏదో తనిఖీ చేస్తున్నట్లు నటించి గన్ బయటకు తీసి అరెస్ట్ చేశారు.

అయితే, ఇది అన్యాయమని, తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో ఫుటేజీని షేర్ చేశారు అశోక్ త్యాగి-రాఖి దంపతలు.  తమకు కొంతమందితో భూవివాదానికి సంబంధిచి తగాదాలు ఉన్నాయని, పోలీసులు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపారని వారు చెప్పుకొచ్చారు. అందుకే తమ కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజ్ ను చెరిపివేయాలని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన మీరట్ ఎస్పీ దెహాత్ కమలేశ్ బహదూర్.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దీని వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు గుర్తించామని, ఎందుకు అలా చేశారో వారిని ప్రశ్నిస్తున్నామని, నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమాల్లో చూశాం ఇలాంటి సీన్లు వీళ్లు మాములోల్లు కాదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.