NTV Telugu Site icon

Meena : తల్లి నిర్ణయంతో కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్

Meena

Meena

Meena : ఒకప్పుడు తల్లులు హీరోయిన్లతో పాటు షూటింగుల్లో పాల్గొనే వారు. వారు ఎలాంటి పాత్రలో నటించాలో వారే నిర్ణయించేవారు. అలా వారి నిర్ణయం వల్ల స్టార్ హీరోయిన్ కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ కోల్పోవాల్సి వచ్చింది. సినిమాల్లో కొన్ని పాత్రలు వారికోసమే పుట్టాయా అన్నట్లు ఉంటాయి. ఆ పాత్రలో వారు తప్ప వేరే వారు చేయలేరు అన్నంతలా ఒదిగిపోతుంటారు నటీనటులు. అలా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాగే రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఇంకొకరు సెట్ కారు అని కూడా స్పష్టం అవుతుంది. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ జీవించారు. ఆ పాత్రను వేరొకరు చేసి ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయి ఉండేవారు కాదేమో.. అయితే ముందుగా రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణను నటిగా అనుకోలేదు. ఆమె హావ భావాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి.

Read Also: Adah Sharma: దేవుడా.. అందానికే ‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తుందే..

నీలాంబరి పాత్ర కోసం దర్శకుడు రవికుమార్ తొలుత నగ్మాను సంప్రదించారట. ఆమెను కలసి సినిమా కథ కూడా చెప్పాడట. పాత్ర నచ్చినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి ఆమె సినిమాను వదులుకుంది. ఆ తర్వాత అప్పట్లో ఒక వెలుగు వెలిగిన మీనాను కలిసి దర్శకుడు కథ వివరించారు. నిజానికి స్టార్ హీరోయిన్‎గా మీనా కొనసాగుతున్నప్పటికీ అప్పట్లో ఆమె ఏ పాత్ర చేయాలన్నది ఆమె తల్లి డిసైడ్ చేసేది. అయితే మీనాకు పాత్ర నచ్చినా.. ఆమె తల్లికి నచ్చకపోవడంతో నీలాంబరి పాత్రకు మీనా కూడా దూరం అయింది. అదే సమయంలో రమ్యకృష్ణను అప్రోచ్ అవ్వడం.. ఆమె వెంటనే ఓకే చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చూపించిన నట విశ్వరూపం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.. ఆమె తప్ప ఇలాంటి పాత్రలు ఎవరు చేయలేరని అందరికీ స్పష్టం అయిపోయింది . ఏది ఏమైనా రమ్యకృష్ణ సినీ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ రోల్ అని చెప్పక మానరు.

Show comments