NTV Telugu Site icon

Medicine Prices Hike: పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచో తెలుసా..?

Medicine

Medicine

భారత దేశంలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఔషద మందుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(NPPA) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణలు చేసినట్లు సమాచారం. దీంతో నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌(NLEM) జాబితాలో ఉన్న మందులపై 0.0055 శాతం మేర ధరలు పెరగబోతున్నాయి. ఇక, ఈ ధరల పెరుగుదల ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రాబోతుంది.

Read Also: INDIA Alliance : బీజేపీతో ఇండియా కూటమి యుద్ధానికి రాంలీలా మైదానం రణరంగంగా మారనుందా ?

పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌ లాంటి 800కు పైగా యాంటీ బయాటిక్‌, యాంటీ ఇన్‌ఫెక్టివ్‌, పెయిన్‌ కిల్లర్‌, స్టెరాయిడ్‌ల ధరలు పెరగబోతున్నాయి. అయితే, మందుల ధరలు గతేడాది 12 శాతం, 2022లో 10 శాతం పెరగడంతో పోల్చుకుంటే ఈసారి పెరిగే ధరలు స్వల్పంగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకొవచ్చు అన్నమాట. అయితే, ఈ లిస్టులో మొత్తం 384 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇందులో కొత్తగా 34 ఔషదాలను చేర్చారు. అంతకు ముందున్న 26 ఔషదాలని తొలగించారు. కాస్ట్‌-ఎఫెక్టివ్‌, క్వాలిటీ మెడిసిన్స్‌ అవైలబిలిటీని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం జాబితాను తయారు చేసింది.

Show comments