మోహన్ బాబు జల్‌పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ను లేవనెత్తారు. మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ ఆందోళనకు మంచు మనోజ్ మద్దతు తెలిపారు.మీడియా ప్రతినిధులతో కలిసి ఆందోళనలో కూర్చున్నారు.
READ MORE: Nimmala Rama Naidu: రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది: మంత్రి నిమ్మల
ఇదిలా ఉండగా.. తాజాగా మంచు మనోజ్ ప్రెస్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు.. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. ఆయన మాట్లాడుతూ.. “నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాం. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నా పై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. 3 రోజులు బయటకు వెళ్ళు.. మనోజ్ కి సర్ధిచెప్తాం అని మా అమ్మను నమ్మించారు. హాస్పిటల్ లో మా అమ్మను చేర్పించారు. ఆ తర్వాత నుంచి నాపై దాడులు మొదలుపెట్టారు. నేను మద్యానికి బానిస అయ్యాను అని మా నాన్న అంటున్నారు. నేను తాగి ఎవరిని కొట్టాను. మా నాన్నను కొట్టానా? మా అమ్మ ను కొట్టానా..? గొడవలు చేసానా? చెప్పుడు మాటలు విని మా నాన్న నన్ను తప్పుపడుతున్నారు.” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE: Manchu Manoj : మీడియా మిత్రులకు క్షమాపణలు.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్