ఎలక్ట్రిక్ బైకులకు, స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు గేర్ లెస్ బైకులు మాత్రమే మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైకు రిలీజ్ అయ్యింది. అహ్మదాబాద్‌కు చెందిన మ్యాటర్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్ ‘మ్యాటర్ ఎరా’ను విడుదల చేసింది. బెంగళూరులో సేల్ కు రెడీగా ఉంచింది. గేర్లతో వచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ పేర్కొంది. సాధారణంగా ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఎలక్ట్రిక్ వాహనాల్లో కనిపించదు.
Also Read:Nitesh Rane: ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ పర్మిషన్ తీసుకున్నాడా..? రాజ్ వ్యవహారంపై బీజేపీ నేత..
ప్రపంచంలోనే మొట్టమొదటి మాన్యువల్ గేర్-షిఫ్టింగ్ సిస్టమ్ (గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్)తో కూడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). కానీ మొదటి 500 మంది కస్టమర్లు ఈ బైక్‌ను కేవలం రూ. 1.74 లక్షల ప్రారంభ ధరకు బుక్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు, ఈ బైక్ బ్యాటరీకి కంపెనీ ప్రారంభ కస్టమర్లకు లైఫ్ టైమ్ ఫ్రీ వారంటీని కూడా ఇస్తోంది. దీని కోసం రూ. 15,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Also Read:PBKS vs RCB : కింగ్ కోహ్లీ వీర బాదుడు, దించికొట్టిన పడిక్కల్.. ఆర్సీబీ గ్రేట్ విక్టరీ..
కంపెనీ రెండు బైక్‌లలో 10 kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించింది. ఇది 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు, విభిన్న రైడింగ్ మోడ్‌లను కూడా ఇందులో అందించామని కంపెనీ తెలిపింది. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్‌లు ఉన్నాయి. ఈ బైక్ కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
Also Read:PBKS vs RCB : కింగ్ కోహ్లీ వీర బాదుడు, దించికొట్టిన పడిక్కల్.. ఆర్సీబీ గ్రేట్ విక్టరీ..
మ్యాటర్ ఎరాలో కంపెనీ IP67 సర్టిఫికేట్ పొందిన 5kWh సామర్థ్యం గల అధిక శక్తి బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. అంటే ఈ బ్యాటరీ దుమ్ము, సూర్యకాంతి, నీటి నుంచి పూర్తిగా సురక్షితం. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 172 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ ఛార్జర్‌తో దీని బ్యాటరీ 0 నుంచి 80% వరకు 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జర్‌తో 1.5 గంటలు మాత్రమే పడుతుంది.
Also Read:Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్ సెంచరీలు..
ఈ ఎలక్ట్రిక్ బైక్ లో స్పోర్టీ లుక్ డిజైన్‌తో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. దీనిలో బైక్ రన్నింగ్, వేగం, బ్యాటరీ రేంజ్, కాల్స్, SMS, నావిగేషన్, ఇతర కనెక్టివిటీ సమాచారం చూడొచ్చు. వాహనదారులు ఈ బైక్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్ ఆప్షన్ ఉంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో కూడిన ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో డ్యూయల్-రియర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.
