NTV Telugu Site icon

Fire Accident: ఆయిల్ కంపెనీలో భారీ పేలుడు.. ఎగిసిపడ్డ మంటలు

Fire

Fire

Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పెలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బాయిలర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాత్రి 11 గంటలకు జరిగింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. పెద్దెతున్న మంటలు ఆకాశాన్నంటాయి. అగ్ని ప్రమాదం తర్వాత నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండడంతో కార్మికులు, కంపెనీ నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: BBL 2025: బిగ్‌బాష్‌ లీగ్‌ 2025 ఫైనల్లో అడుగుపెట్టిన హోబర్ట్‌ హరికేన్స్‌

పేలుడు జరిగిన సమయంలో కంపెనీ షిఫ్ట్ లో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ భారీ ప్రమాదంపై సంబంధిత అధికారులు స్పందించి మంటలను అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టం గురించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పక్కనే నివసించే ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అధికారులందరూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.