NTV Telugu Site icon

Gas Leakage: కెన్యాలో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి, 165 మందికి గాయాలు..

Blast

Blast

కెన్యా రాజధాని నైరోబీలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 165 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు శబ్ధం చాలా పెద్దగా రావడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 2 మంది మృతి చెందారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Read Also: America: అమెరికాలో మ‌రో భార‌తీయ విద్యార్థి మృతి.. ఈ ఏడాది నాలుగో మరణం..

ఇదిలా ఉండగా, గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయని.. అది త్వరగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించిందని కెన్యా మీడియా తెలిపింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక, పేలుడు ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంపెనీ లోపల ఉన్న సిబ్బంది సిలిండర్‌లో గ్యాస్ నింపుతుండగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు.

Read Also: Delhi: ఛండీఘ‌ర్ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు.. ఆందోళనలకు ఆప్ పిలుపు..

ఇక, భారీ పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు పేలుడు గురించి పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదం కారణంగా కంపెనీ భవనం పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.