NTV Telugu Site icon

Raviteja : కిక్ లాంటి కిక్కు ఇస్తుంది.. మాస్ జాతర.. ఇందులో నో డౌట్

Mass

Mass

Raviteja : రవితేజ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి “మాస్ జాతర” అనే టైటిల్ ను పెట్టారు. “మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.

Read Also:Sankranti Celebrations: విశాఖలో సంక్రాంతి సందడి.. జీవీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు మొదలు

ఇక ఈ సినిమాలో యూత్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో “ధమాకా”తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో “మాస్ జాతర” రూపంలో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇప్పటికే ఆయన బ్యానర్ నుంచి డాకు మహారాజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకుంది.

Read Also:Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్

బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఉండడంతో ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐతే ప్రస్తుతం సితార బ్యానర్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మాస్ జాతర సినిమా వస్తుంది. రవితేజ మాస్ జాతర మీద అంచనాలు పెంచేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. మాస్ జాతరలో రవితేజ మార్క్ ఫన్ ఉంటుందని సినిమాలో మళ్లీ కిక్కు సినిమాను గుర్తు చేస్తుందని అన్నారు. రవితేజ కిక్ సినిమా సూపర్ హిట్ వైబ్ తెలిసిందే. మళ్లీ అలాంటి కిక్కే మాస్ జాతర ఇస్తుందని అంటున్నారు. మరి నిర్మాత ఇంత కాన్ ఫిడెంట్ గా చెబుతున్నారు అంటే కచ్చితంగా మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మాస్ జాతర నిజంగానే హిట్టు జాతర ఇచ్చేలా ఉంది.

Show comments