NTV Telugu Site icon

Mass Jatara : ‘మాస్ జాతర’ను పరుగులు పెట్టిస్తున్న రవితేజ

New Project (2)

New Project (2)

Mass Jatara : విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి “మాస్ జాతర” అనే టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ క్రియేటివ్ గా ఉంది. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. “మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు.

Read Also:Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. పరిస్థితి విషమం

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను 2025 మే 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Read Also:Sukumar : కన్ఫామ్.. పుష్ప 2 కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చింది దేవిశ్రీనే.!

Show comments