Site icon NTV Telugu

Mary Kom: బాక్సర్ మేరీ కోమ్‌ ఇంట్లో దొంగతనం!

Mary Kom Robbery

Mary Kom Robbery

ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ ఇంట్లో దొంగలు పడ్డారు. శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో చోరీ జరిగింది. దొంగతనం జరిగిన సమయంలో మేరీ కోమ్ ఇంట్లో లేరు. ఓ మారథాన్ ఈవెంట్‌లో పాల్గొనడానికి మేఘాలయలోని సోహ్రాకు వెళ్లారు. మేరీ కోమ్ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుల వివరాలు, డబ్బు నష్టం డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: IND vs PAK Final: పన్నెండింటిలో నాలుగే.. టీమిండియాను కలవరపెడుతున్న రికార్డులు!

మణిపూర్‌కు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ భారతదేశంలోని స్టార్ అథ్లెట్లలో ఒకరు. భారత్ తరఫున ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచారు. మహిళా బాక్సర్లలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 6 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా మేరీ కోమ్ నిలిచారు. ఐదుసార్లు ఆసియా ఛాంపియన్‌ అయిన మేరీ కోమ్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

Exit mobile version