అంగ వైకల్యం లేని వారు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కారులోకి ఎక్కడం, దిగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వృద్ధులు, వైకల్యాలున్నవారు కారు ఎక్కడానికి ఇబ్బంది పడతారు. మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ కారు వ్యాగన్ఆర్‌లో ప్రత్యేక స్వివెల్ సీటు ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. దీని వలన వృద్ధులు, వైకల్యాలున్నవారు కారులోకి ఎక్కడం, దిగడం సులభం అవుతుంది. స్వివెల్ సీటు అంటే 360 డిగ్రీలు తిరగగలిగే సీటు, ఇది కుర్చీలు, కార్లు, వ్యాన్‌లలో సౌలభ్యం కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు సులభంగా ఎక్కడానికి, దిగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
Also Read:Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వం ఉండి ఏం లాభం.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ TRUEAssist టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మారుతి సుజుకి తన ఫ్యామిలీ కార్ వాగన్ఆర్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది 11 నగరాల్లోని 200 కి పైగా మారుతి సుజుకి అరీనా డీలర్‌షిప్‌లలో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులో ఉంది. మారుతి వ్యాగన్ఆర్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 6.95 లక్షల వరకు ఉంటుంది.
Also Read:Tata Sierra: ఏంది మామా ఈ క్రేజ్.. టాటా సియెర్రాకు తొలి రోజే 70,000 బుకింగ్స్..
వ్యాగన్ఆర్ స్వివెల్ సీటుకు కస్టమర్లు సానుకూలంగా స్పందిస్తే, భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను మరిన్ని నగరాలకు విస్తరిస్తామని మారుతి సుజుకి చెబుతోంది. వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి, కాబట్టి ఈ ఫీచర్‌ను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మారుతి సుజుకికి కీలక అడుగు. మారుతి సుజుకి అరీనా డీలర్‌షిప్‌ల నుండి కస్టమర్లు స్వివెల్ సీటును రెట్రోఫిట్ కిట్‌గా కొనుగోలు చేయవచ్చు. దీనిని కొత్త వ్యాగన్ఆర్‌లో లేదా ఇప్పటికే ఉన్న వ్యాగన్ఆర్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు.
