Site icon NTV Telugu

మారుతి e-Vitara కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఛార్జింగ్‌కు నో టెన్షన్.. !

Maruti Suzuki E Vitara

Maruti Suzuki E Vitara

Maruti Suzuki e-Vitara Launched: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజూకీ తొలి ఎలక్ట్రిక్ వాహనం “ఇ-విటారా”ను ఎట్టకేలకూ భారత్‌లో నిన్న(బుధవారం) అధికారికంగా ప్రారంభించింది. ఇది తొలి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనం. ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్పత్తి ఆగస్టు 2025లో గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ప్రారంభమైంది.. అయితే.. మారుతి సుజుకీ తమ కొత్త e-Vitara ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందు.. కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. దేశంలో EV ఛార్జింగ్ వ్యవస్థను వేగంగా విస్తరిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి మంచి అనుభవం ఇవ్వాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనం వాడకాన్ని సునాయాసం చేసేలా ఛార్జింగ్ సౌకర్యం నుంచి డిజిటల్ యాప్‌లు, సర్వీస్ సపోర్ట్ వరకు అన్నింటినీ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.

READ MORE: Akhanda2 Thaandavam : మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్.. ఇప్పటికి ఓపెన్ కానీ నైజాం బుకింగ్స్

మారుతి సుజుకీ భారత్‌లో EV వినియోగాన్ని పెంచడానికి భారీ ప్రణాళికను ప్రకటించింది. e-Vitara కొనుగోలుదారుల కోసం రూ.250 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక నగరాల్లో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవాలన్నది సంస్థ లక్ష్యంగా చెబుతోంది. అంతేకాకుండా కంపెనీ “e for me” అనే కొత్త యాప్‌ను కూడా తీసుకొస్తోంది. దీని ద్వారా యూజర్లు దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్లను కనుగొనడం, డిజిటల్ పేమెంట్లు చేయడం, సర్వీస్ అపాయింట్మెంట్లు బుక్ చేయడం అన్ని అందుబాటులో ఉంటాయి. అలాగే, ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,500 EV-రెడీ సర్వీస్ సెంటర్లను సిద్ధం చేసింది. ఇందువల్ల EV కారు వాడకంలో యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి సపోర్ట్ అందుతుంది.

READ MORE: Mahindra XEV 9S First Drive Review: దేశపు మొట్టమొదటి 7-సీటర్ EV.. ఫర్ఫామెన్స్ ఎలా ఉందంటే..?

Exit mobile version