NTV Telugu Site icon

Maruti Suzuki Dzire: 5-స్టార్‌ రేటింగ్ పొందిన డిజైర్‌కి యాక్సిడెంట్.. ప్రయాణికులు పరిస్థితి?

Maruti Suzuki Dzire

Maruti Suzuki Dzire

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకికి చెందిన ఫోర్త్‌ జనరేషన్‌ డిజైర్‌ అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో ఈ కాంపాక్ట్‌ సెడాన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన విషయం తెలిసిందే. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్‌, చిన్నారుల భద్రతకు సంబందించి 4 స్టార్‌ పొందింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం విశేషం. సేఫ్టీ రేటింగ్‌ విషయంలో మారుతీ సుజుకీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. డిజైర్‌ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ అందుకోవడం గమనార్హం. స్వచ్ఛందంగా మారుతీ ఈ వెహికల్‌ను క్రాష్‌ టెస్ట్‌కు పంపింది. పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను కొత్త డిజైర్‌ సాధించింది. చిన్నారుల భద్రతకు సంబంధించి 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు పొందింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌ విత్‌ రిమైండర్‌ ఉన్నాయి.

READ MORE: Chennai: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురు మృతి

తాజాగా ఈ కారు ప్రమాదానికి గురైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాక్సిడెంట్ గురించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. వీడియో ప్రకారం.. కొత్త మారుతీ సుజుకీ డిజైర్ ఒక కాంక్రిట్‌ను ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో కారు కుడివైపు భాగం దెబ్బతింది. వెనకాల ఎడమ వైపు భాగంలో ఇంధనం నింపే ప్రదేశం కూడా కొంత దెబ్బతింది. లోపల ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నాయి. అంటే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తీరు మెరుగ్గానే ఉంది. బయట ప్రాంతంలో డ్యామేజ్ అయ్యింది కానీ.. లోపల ప్రయాణికులకు మాత్రం సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.

READ MORE: Karnataka Budget: ఆధునిక “ముస్లిం లీగ్” బడ్జెట్.. కర్ణాటక బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు..