NTV Telugu Site icon

Viral Video : వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..

marriges photo shoot

marriges photo shoot

పెళ్లిళ్లకు ఫోటోలను దిగాలను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి.. కొన్ని ఫోటోలు మాత్రం జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి జంట ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వరుడి మెడకు కాలును చుట్టి.. వధువు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ”బాబాయ్.. ఇవేం స్టంట్స్”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వినూత్నం విన్యాసం చేశారు.

అందరు చేసినట్లుగా కాకుండా కొత్తగా ట్రై చేశారు.. నిలబడి ఉన్న వరుడి కాలు మీద ఓ కాలు పెట్టిన వధువు.. మరో కాలును అతడి మెడకు చుట్టేసి.. బ్యాలెన్స్‌ మీద చేతులు వదిలేసి ఏటవాలుగా వంగి చేతులు అటూ, ఇటూ చాపుతూ ఫోజులు ఇచ్చింది..వరుడు కూడా వధువును కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమా స్టైల్లో ఫోజులు ఇచ్చాడు. స్టంట్ విజయవంతంగా పూర్తవడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

ఆ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. వరుడు కూడా వధువును కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమా స్టైల్లో ఫోజులు ఇచ్చాడు. స్టంట్ విజయవంతంగా పూర్తవడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు.. వారిద్దరినీ చూసిన వారంతా ప్రశంసలు కురిపించారు.. మరి కొందరు మాత్రం ఇలాంటి ఫోటో షూట్ లను ఎందుకు రా చేస్తారు.. వీటిని ఫోటో షూట్ అంటారా.. కుస్తీ పోటీనా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..