NTV Telugu Site icon

MLA KP Nagarjuna Reddy: భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్‌ స్మృతి వనం.. పెద్ద ఎత్తున తరలిరండి..

Kp Nagarjuna Reddy

Kp Nagarjuna Reddy

MLA KP Nagarjuna Reddy: భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్‌ స్మృతి వనం అని పేర్కొన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. విజయవాడలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన 206 అడుగుల అతి భారీ అంబేద్కర్‌ విగ్రహం భావితరాలకు స్ఫూర్తిగా నిలిస్తుందన్నారు.. తన క్యాంపు కార్యాలయంలో మార్కాపురం పట్టణ, రూరల్‌, తుర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్‌, రూరల్‌ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలో సమావేశమైన ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read Also: Daggubati Purandeswari: 22న సెలవు ప్రకటించాలి.. పురంధేశ్వరి డిమాండ్‌

డాక్టర్‌బీఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. సమాజంలో అసమానతలు తొలగించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. మరోవైపు మార్కాపురం 3వ సచివాలయం పరిధిలోని 3, 4, 6, 7, 8న వార్డుల్లో ప్రజలకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల వద్దకే స్పెషలిస్ట్‌ వైద్యులు వచ్చి మెరుగైన సేవలు అందించేలా చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి రెండో విడత నిర్వహిస్తున్నామని వెల్లడించారు మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. కాగా, విజయవాడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న విషయం విదితమే.. ఈ కార్యక్రమానికి తరలిరావాలంటూ సీఎం వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.