Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్, ఓపెన్ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muse Spark: ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ప్లాట్‌ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తన ప్రభావాన్ని మరింత పెంచే దిశగా ‘మ్యూస్ స్పార్క్’ అనే కొత్త AI మోడల్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్రయోగంతో Google, OpenAI, Anthropic వంటి దిగ్గజాలకు నేరుగా సవాల్ విసురుతోంది. మెటా విడుదల చేసిన ఈ మ్యూస్ స్పార్క్ మోడల్, గత ఏడాది నుంచి భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేసిన కొత్త AI విభాగం ఫలితం. ప్రారంభానికి ముందు ఈ ప్రాజెక్ట్‌కు అంతర్గతంగా “అవకాడో” అనే కోడ్ నేమ్ ఉపయోగించారు. ప్రస్తుతం ఈ మోడల్ మెటా స్టాండ్అలోన్ AI యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు మెటా AI స్మార్ట్ గ్లాసెస్‌లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
Read Also: Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు
Also Read
- Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
- Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా 'అర్నబ్'.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
- Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
- AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
ఇప్పటికే AI రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా Google మరియు OpenAI సంస్థలు ముందంజలో ఉండగా, మ్యూస్ స్పార్క్‌తో ఆ అంతరాన్ని తగ్గించాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. రచన, తార్కికత వంటి అంశాల్లో ఈ మోడల్ మంచి పనితీరు కనబరుస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే కోడింగ్ సామర్థ్యాల్లో మాత్రం ఇతర మోడళ్లతో పోలిస్తే కొంత వెనుకబడి ఉందని సమాచారం. AI అభివృద్ధి కోసం జుకర్‌బర్గ్ గత ఏడాది నుంచే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 29 ఏళ్ల అలెగ్జాండర్ వాంగ్‌ను చీఫ్ AI ఆఫీసర్‌గా నియమించడం, అలాగే OpenAI, Google వంటి సంస్థల నుంచి నిపుణులను భారీ పారితోషికాలతో నియమించడం జరిగింది. లామా-4 మోడల్‌పై పనిచేసిన పాత బృందాన్ని కూడా కంపెనీ పునర్వ్యవస్థీకరించింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈసారి మెటా తన AI మోడల్‌ను ఓపెన్ సోర్స్‌గా విడుదల చేయకుండా ప్రైవేట్‌గా ఉంచుతోంది. గతంలో మెటా తన మోడళ్లను డెవలపర్లకు అందుబాటులో ఉంచగా, ఇప్పుడు క్లోజ్డ్ మోడల్ వైపు అడుగులు వేస్తోంది. ఇది కంపెనీ వ్యూహంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. AI అభివృద్ధి కోసం మెటా భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. కొత్త డేటా సెంటర్ల నిర్మాణానికి సుమారు 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2026 నాటికి సుమారు 135 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది గత ఏడాది పెట్టుబడితో పోలిస్తే దాదాపు రెట్టింపు. మొత్తానికి, మ్యూస్ స్పార్క్ ద్వారా మెటా AI పోటీలో తిరిగి బలంగా నిలబడాలని ప్రయత్నిస్తోంది. అయితే Google, OpenAI, Anthropic వంటి సంస్థలతో పోటీని ఎంతవరకు ఎదుర్కోగలదన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!