Site icon NTV Telugu

Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..

Niamabad

Niamabad

నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా బరి తెగించింది. నిర్మల్ కు చెందిన ముఠా కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తూ అరాచకానికి తెగబడింది. సమాచారం అందుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ నగర శివారులో కారును పట్టుకునే ప్రయత్నం చేసింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గంజాయి ముఠా మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ సౌమ్య కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సౌమ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గంజాయి ముఠా సభ్యులు మహమ్మద్ సోఫియోడ్డిన్, సయ్యద్ సాయల్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version