Site icon NTV Telugu

March 1st New Rules: మార్చి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..

March 1 Daily Calendar Icon In Flat Design Style

March 1 Daily Calendar Icon In Flat Design Style

ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. రేపటితో ఫిబ్రవరి నెల ముగియనుంది.. మార్చి నెలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. న్యూ రూల్స్ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్ఫష్టం చేసింది.. ఈమేరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు దారులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు..

అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం కు సంబందించిన కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురాబోతుంది.. మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. తొలుత ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ పొడిగించింది..

ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి. కొన్నిసార్లు నెల రెండో అర్ధ భాగంలోనూ మారుస్తారు. అయితే, ఫిబ్రవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచగా.. గృహ వినియోగానికి సంబంధించి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు… ఇవేకాదు జీఎస్టీ చెల్లింపులలో కూడా కొన్ని మార్పులను తీసుకురానున్నట్లు తెలుస్తుంది..

Exit mobile version