Site icon NTV Telugu

Maoists Surrender: నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు!

Maoists Surrender

Maoists Surrender

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’తో యాభై ఏళ్ల చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్‌ కకావికలం అవుతోంది. భద్రతా దళాల నిరంతర ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉత్తర బస్తర్‌ డివిజన్ ఇన్‌ఛార్జి రాజ్ మాన్ లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్‌ అభయ్‌ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు.

దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న జనజీవన స్రవంతిలో కలిశారు. ఆశన్నతో పాటు 130 లొంగిపోయారు. తన 130 మంది సహచరులతో కలిసి భైరామ్‌గఢ్ (బీజాపూర్ జిల్లా)లో ఈరోజు సరెండర్ అయ్యారు. మాడ్ డివిజన్ బృందం మొత్తం ఇంద్రావతి నది అవతల నుండి 70కి పైగా ఆయుధాలతో భైరామ్‌గఢ్‌కు చేరుకున్నారు. మావోయిస్టులు శాంతి చర్చల కోసం ఆరు నెలల పాటు ఎదురు చూశారు. మావోయిస్టులు వ్యతిరేక ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఆశన్న ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆశన్నతో పాటు 130 మంది మావోయిస్టులను బీజాపూర్ పోలీసులు బస్సులోతరలించారు. నక్సలైట్లందరూ తమ ఆయుధాలను అప్పగించి సరెండర్ అయ్యారు.

తెలంగాణ పోలీసుల ఎదుట మరో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. సికాస కార్యదర్శిగా కొనసాగిన ప్రభాత్.. తీవ్రమైన అనారోగ్యంతో లొంగిపోయారు. 2027 వరకు మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుధాలు వదిలపెట్టాల్సిందేనని, లేదంటే ఎవరినీ వదలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు హెచ్చరించారు. చెప్పినట్టుగానే భద్రతా దళాలు భారీగా కూంబింగ్‌లు నిర్వహిస్తోంది. వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. అగ్ర నేతలు కూడా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించి.. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.

Exit mobile version