NTV Telugu Site icon

Matangeswara Temple : సైన్స్ కు కూడా అందని అద్భుతాలు.. ఏడాదికొకసారి పెరుగుతున్న లింగం…

Matngi

Matngi

ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం గురించి అందరు వినే ఉంటారు.. ఎంతో మహిమన్విత ఆలయం ఇది.. ఈ ఆలయం మధ్యప్రదేశ్లో కొలువై ఉంది.. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. పురాతనమైన ఆలయాలకు నిలయం.. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది. ఇప్పటికి ఆ రహస్యం గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు.. ఇప్పుడు మరో ఆలయం మిస్టరీగానే మిగిలింది..

మనదేశంలో ఎన్నో అద్భుతమైన శివలింగాలు ఉన్నాయి.. మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. కానీ ఈ ఆలయంలో ఉన్న శివలింగంకు ప్రత్యేకమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. అంటే శివలింగంకు ప్రాణం ఉందని ప్రజలు చెబుతుంటారు.. అందుకే ప్రతి ఏడాది పౌర్ణమికి లింగం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికి దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని అక్కడి భక్తులు చెబుతున్నారు..

పురాణాల ప్రకారం.. ఈశ్వరుడి వచ్చ పచ్చల రత్నం ఉందట. దానిని శివుడు పాండవుల్లో అగ్రజుడు యుధిష్ఠిరునికి ఇచ్చాడు. అనంతరంయుధిష్ఠిరుడి ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడు.. ఆ తర్వాత ఆ రత్నం ఒక మహర్షి చేతికి చిక్కుతుంది. రత్నాన్ని భద్ర పరచడానికి ఈ శివలింగం మధ్య భూమిలో పాతి పెట్టాడు.. అప్పటి నుంచి ఆ రత్నం లింగం కిందే ఉందని చెబుతున్నారు.. అందుకే లింగం కూడా పెరుగుతుంది.. జీవం ఉన్న లింగంలా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ సైన్స్ కు కూడా అందని ఏదో మిస్టరీ ఉందని నిపుణులు చెబుతున్నారు… అదేంటో ఇప్పటికి కనుక్కోలేక పోతున్నారు..