Site icon NTV Telugu

Breaking News: ఫైనల్లో మను భాకర్ ఓటమి..

Manu Bhaker

Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో.. ఓటమి పాలయ్యారు. హోరా హోరీగా సాగిన పోరులో అద్భుతంగా రాణించిన మను.. 4వ స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్-3 లో ఉంటే పతకం వచ్చేది. ఈ పోటీలో మొత్తం 10 సిరీస్ షాట్లు కాల్చాల్సి ఉంది. ఒక సిరీస్‌లో మొత్తం ఐదు షాట్లు ఉన్నాయి. మూడు సిరీస్‌ల తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. కాగా.. ఒలింపిక్స్‌లో ఆమె ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే..

Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మాములుగా లేదు..

హంగేరీకి చెందిన నాల్గవ ర్యాంక్ వెరోనికా మేజర్, మను భాకర్ మధ్య పోటీ జరిగింది. ఈ సిరీస్‌లో మను మూడు షాట్లను మిస్ చేయగా, వెరోనికా రెండు షాట్లను మిస్ చేసి మూడు షాట్లతో లక్ష్యాన్ని చేధించి మను కంటే ముందుంది. ఈ విధంగా మను పతకాన్ని కోల్పోయింది. దీంతో.. వెరోనికా కాంస్యం కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ యాంగ్ స్వర్ణ పతకాన్ని, ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె రజత పతకాన్ని గెలుచుకున్నారు. అయితే.. 10 సిరీస్‌ల తర్వాత ఇద్దరి స్కోరు 37-37గా ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య షూటౌట్ జరిగింది. అందులో జిన్ టార్గెట్‌పై నాలుగు షాట్లు కొట్టగా, కెమిల్ ఒకే ఒక్క షాట్ లక్ష్యాన్ని చేధించింది.

Exit mobile version