NTV Telugu Site icon

Manu Bhaker-Neeraj Chopra: మను బాకర్‌ ఇంకా చిన్నపిల్ల.. పెళ్లి వయసు రాలేదు: మను తండ్రి

Manu Bhaker Marriage

Manu Bhaker Marriage

Iam not thinking of marriage says Manu Bhaker Father: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పతకాలు సాధించిన భారత స్టార్స్‌ నీరజ్‌ చోప్రా, మను బాకర్‌ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌ సందర్భంగా ఇద్దరు సన్నిహితంగా మెలగడం, మను తల్లి నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడడం, నీరజ్‌ చేతిని తలపై ఉంచి మను తల్లి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడం నెట్టింట చర్చనీయాంశం అయింది. దాంతో మనుతో నీరజ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై మను తండ్రి రామ్‌ కిషన్ బాకర్ స్పందించారు.

మను బాకర్‌ ఇంకా చిన్నపిల్లే అని ఆమె తండ్రి రామ్‌ కిషన్ బాకర్ పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాతో రామ్‌ కిషన్ మాట్లాడుతూ… ‘మను బాకర్‌ ఇంకా చిన్నపిల్ల. ఆమెకు పెళ్లి వయసు కూడా రాలేదు. మేం పెళ్లి గురించి అస్సలు ఆలోచించడం లేదు. నా సతీమణి నీరజ్‌ను ఓ బిడ్డలా భావిస్తోంది’ అని అన్నారు. నిజానికి నీరజ్‌, మను తల్లి మధ్య జరిగింది ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై నీరజ్‌ లేదా మను తల్లి మాట్లాడితే అసలు మ్యాటర్ ఏంటో తెలియనుంది. ‘నీరజ్ పతకం గెలిచినప్పుడు దేశం మొత్తం ఎలా చూసిందో.. అలానే పెళ్లి విషయం అందరికీ తెలుస్తుంది’ అని నీరజ్ బంధువు ఒకరు పేర్కొన్నారు.

Also Read: Guntur Drugs Case: గుంటూరు డ్రగ్స్ కేసు.. సాయి మస్తాన్‌ అరెస్టు!

పారిస్ ఒలింపిక్స్‌లో బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా రజతంను కైవసం చేసుకున్నాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తం 12 మంది పోటీపడ్డ ఫైనల్‌లో మనోడు రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు మను బాకర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పతకాలను సాధించింది. ఈ ఇద్దరిది స్వరాష్ట్రం హరియాణానే కావడం విశేషం.

Show comments