NTV Telugu Site icon

Manu Bhaker: మొదటిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్

Manu Bhaker

Manu Bhaker

Manu Bhaker: నేడు జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో ఒలింపిక్ పతక విజేత మను భాకర్ మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. మను భాకర్ తన తండ్రి రామ్ కిషన్ భాకర్‌తో కలిసి 2024 హర్యానా ఎన్నికల కోసం చర్కి దాద్రీలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. ఇక ఓటు వేసిన తర్వాత డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేయడం వ్యక్తి బాధ్యత అని అన్నారు. ఈ దేశంలోని యువతగా, అత్యంత అనుకూలమైన అభ్యర్థికి ఓటు వేయడం మన బాధ్యత. చిన్న అడుగులు పెద్ద లక్ష్యాలకు దారితీస్తాయి.. నేను మొదటిసారి ఓటు వేశాను… అని మను భాకర్ అన్నారు.

Sachin Kurmi: ఎన్సీపీ నేత దారుణ హత్య.. ఉద్రిక్తత వాతవరణం

ఇక నేడు హర్యానాలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఓటింగ్ కోసం 20,632 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలలో 1,07,75,957 మంది పురుషులు, 95,77,926 మంది మహిళలు, 467 మంది థర్డ్ జెండర్ ఓటర్లు మొత్తంగా 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు.

TTD: టీటీడీ బోర్డు మెంబర్ గా టాలీవుడ్ నుండి ఎవరు..?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,462 మంది పోలీసులు, 21,196 మంది హోంగార్డులు, 10,403 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీఓ)లను మోహరించినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. పౌరులు నిర్భయంగా ఓటు వేసేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి మూలలో గట్టి నిఘాఉంచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు 31 సీట్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత జేజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది.

Show comments