పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. భారత్ ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఆరో రోజు స్వప్నిన్ కుసానే మూడో కాంస్యం సాధించాడు. కాగా మను భాకర్ తొలి పతకాన్ని సాధించి భారత్ కు శుభారంభం చేసింది. తర్వత సరబ్‌జోత్ సింగ్ తో కలిసి మరోసారి మను బరిలో నిలిచి మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. అయితే నేడు భారత్ మరోసారి మను భాకర్ ను రంగంలోకి దించనుంది. ఆమె 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ప్రెసిషన్ మ్యాచ్‌లో పోటీపడనుంది. దీంతో పాటు ఈ రోజు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌కు మ్యాచ్ ఉంటుంది. ఏడో తేదీన భారత్ పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం…
READ MORE: Rahul Gandhi: నాపై దాడులకు ఈడీ యత్నిస్తోంది.. రాహుల్ సంచలన ఆరోపణలు
షూటింగ్…
మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ : ఇషా సింగ్, మను భాకర్ – 12.30
పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1: అనంత్‌జిత్ సింగ్ నరుకా – మధ్యాహ్నం 1.00
ఆర్చరీ…
మిక్స్‌డ్ టీమ్ (1/8 ఎలిమినేషన్): భారత్ (ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్) vs ఇండోనేషియా – 1.19 PM
READ MORE: Raj Tarun Lavanya Case: హైడ్రామాలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ తల్లితండ్రులు కంప్లైంట్..
రోయింగ్…
పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్ (ఫైనల్ D): బల్‌రాజ్ పన్వార్ – మధ్యాహ్నం 1.48
జూడో…
ఉమెన్స్ ప్లస్ 78 కేజీ (ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32): తులికా మన్ vs ఇడాలిస్ ఓర్టిజ్ (క్యూబా) – మధ్యాహ్నం 2.12
READ MORE: AP Capital Amaravati: రాజధాని నిర్మాణంలో కీలక అడుగులు..! నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు..
సెయిలింగ్….
మహిళల డింగీ (రేస్ త్రీ): నేత్ర కుమనన్ – మధ్యాహ్నం 3.45 గంటలకు
మహిళల డింగీ (రేసు నాలుగు): నేత్ర కుమనన్ – సాయంత్రం 4.53
పురుషుల డింగీ (రేస్ త్రీ): విష్ణు శరవణన్ – రాత్రి 7.05
పురుషుల డింగీ (రేసు నాలుగు): విష్ణు శరవణన్ – రాత్రి 8.15
హాకీ….
పురుషుల టోర్నమెంట్ (గ్రూప్ స్టేజ్): భారత్ vs ఆస్ట్రేలియా – సాయంత్రం 4.45
బ్యాడ్మింటన్….
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్: లక్ష్య సేన్ vs చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) – 6:30 PM
అథ్లెటిక్స్….
మహిళల 5,000 మీటర్లు (హీట్ వన్): అంకిత ధ్యాని – రాత్రి 9.40 గంటలకు
మహిళల 5,000 మీటర్లు (హీట్ టూ): పరుల్ చౌదరి – రాత్రి 10.06 గంటలకు
పురుషుల షాట్‌పుట్ (అర్హత): తేజిందర్‌పాల్ సింగ్ టూర్ – రాత్రి 11.40