NTV Telugu Site icon

Paris Olympics 2024: భారత్ ఖాతాలో తొలి పతకం..చరిత్ర సృష్టించిన మను భాకర్

Manu Bhakar

Manu Bhakar

పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. షూటింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన దేశంలోనే తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 221.7 పాయింట్లతో ఆమె చాలా దగ్గర తేడాతో రజత పతకాన్ని కోల్పోయింది. కొరియా షూటర్లు బంగారు, రజత పతకాలు సాధించారు. మనుకి ఇది రెండో ఒలింపిక్స్‌. మను భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ ఈవెంట్ సమయంలో పిస్టల్ పనిచేయకపోవడం వల్ల, ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఆవేదనకు గురైంది. టోక్యోలో దాదాపు మొత్తం భారతీయ షూటింగ్ బృందం ప్రదర్శన నిరాశపరిచింది.

READ MORE: Restaurant: ఫుడ్ ఆర్డర్‌తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కి రూ. 35000 ఫైన్..

మను లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ పూర్తిగా క్రీడలపై దృష్టి సారించింది. ఫలితంగా 20 ఏళ్లలో ఒలింపిక్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా అవతరించడమే కాకుండా పతకం కూడా సాధించింది. ఆమె కంటే ముందు.. సుమా షిరూర్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా ఈ ఘనత.. మను సాధించింది. ఈ విజయంలో మను తల్లి పాత్ర చాలా ఉంది. ఆమె తన కుమార్తెను ప్రాక్టీస్ చేయడానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని వదిలివేసింది.

Show comments