Site icon NTV Telugu

Manjima Mohan : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మలయాళ ముద్దుగుమ్మ

Manjima Mohan

Manjima Mohan

Manjima Mohan : ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ నాగచైతన్యకు జోడీగా పరిచయమైన మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హీరో శింబుకు జంటగా ‘అచ్చం యంబదు మడమయడా’ చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం పలు కోలీవుడ్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్‌ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీ ఒక్కటవుతున్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. వీరి పెళ్లికి చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ వేదికకానున్నట్లు సమాచారం. తాజాగా మంజిమా మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో గౌతమ్‌ కార్తీక్‌తో ఉన్న ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలను పంచుకుంది. మంజిమా మోహన్ గ్రీన్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించగా…. గౌతమ్ కార్తీక్ పైజామాతో కనువిందు చేశారు. దీంతో వారి అభిమానులు కాబోయే జంటకు ముందుగానే కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

Exit mobile version