NTV Telugu Site icon

Paralympics 2024: భారత్కు పతకాల పంట.. మురుగేశన్కు రజతం, మనీషాకు కాంస్యం

Manisha

Manisha

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ కు పతకాల పంట పండుతుంది. తాజాగా.. మరో రెండు పతకాలు సాధించింది. భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి రెండు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ రజత పతకాన్ని గెలుచుకుంది. అదే విభాగంలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే.. బ్యాడ్మింటన్‌లో దేశానికి ఇది మూడో పతకం. మురుగేశన్, మనీషా కంటే ముందు నితీష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Read Also: Sultan Hassanal: ప్రపంచంలోనే అతిపెద్ద పాలెస్.. బంగారం పూత పూసిన విమానం.. అసలెవరీ సుల్తాన్?

కాంస్య పతక పోరులో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రెన్‌ను ఓడించింది. ఫైనల్‌లో మురుగేశన్ చైనాకు చెందిన యాంగ్ క్వి జియాతో తలపడింది. తన ప్రత్యర్థిని అధిగమించలేకపోయింది. దీంతో.. 17-21, 10-21 తేడాతో ఓడి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Read Also: Madhya Pradesh: ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు..

Show comments