NTV Telugu Site icon

Bharateeyudu 2: భారతీయుడు 2లో మరో హీరోయిన్.. ఈ ట్విస్ట్ ఏంటి సామీ!

Manisha Koirala Indian 2

Manisha Koirala Indian 2

Manisha Koirala in Bharateeyudu 2: అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా, సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ ఎస్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో కమల్ సేనాపతిగా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. కమల్‌ హాసన్‌తో పాటు సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా భారతీయుడు 2లో మరో హీరోయిన్ కూడా ఉందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాల కూడా భారతీయుడు 2 కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ శంకర్‌తో మనీషా దిగిన ఫొటో వైరల్‌ కావడంతో.. ఆమె కూడా అతిథి పాత్రలో నటించారని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో 53 ఏళ్ల మనీషా ఎలాంటి పాత్రలో కనిపించనున్నారన్నదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మనీషా చివరిగా తమిళంలో ధనుష్‌ నటించిన మాప్పిళై చిత్రంలో నటించారు. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్ర చేశారు. హీరామండి 2లో ఆమె నటించనున్నారు.

Also Read: Rakul Preet Singh: నా కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమా ఇది: రకుల్‌

భారతీయుడు 2 చిత్రంను లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 12న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడుకు సీక్వెల్‌గా ఇది రానుంది.

 

Show comments