NTV Telugu Site icon

Manish Sisodia: మనీష్ సిసోడియాకు నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Manish Sisodia

Manish Sisodia

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగించారు. కాగా.. నేటికి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.

CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

తాజాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ లభించలేదు. దీంతో.. సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీష్ సిసోడియా.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ, ఈడీ కేసులో బెయిల్‌ను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

Stock market: ఆల్‌ టైమ్ రికార్డ్‌లు సొంతం చేసుకున్న సూచీలు

గత ఏడాది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ, మార్చి 9న ఈడీ అరెస్ట్ చేశాయి. ఆ తర్వాత కేజ్రీవాల్ కేబినెట్‌కు రాజీనామా చేశారు. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు.