Site icon NTV Telugu

Manipur : మందుబాబు మేలుకో.. 30ఏళ్ల నిషేధానికి తెర.. తాగేంత తాగేసెయ్

Liquor

Liquor

Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తెరపడింది. ఈ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా మద్యం అమ్మడం, త్రాగడం నిషేధించబడింది. అయితే ఇప్పుడు మణిపూర్‌లో మద్యం అమ్మకం, వినియోగం చట్టవిరుద్ధం కాదు. ఇష్టానుసారం ప్రజలు ఇప్పుడు మద్యం తాగేయవచ్చు. గ్రేటర్ ఇంఫాల్, జిల్లా ప్రధాన కార్యాలయం, పర్యాటక ప్రదేశాలలో ఇక నుండి మద్యం విక్రయించవచ్చు.. వినియోగించవచ్చు. అలాగే, రిజిస్టర్ చేయబడిన కనీసం 20 కంటే ఎక్కువ గదులు ఉన్న హోటళ్లకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుంది.

Read Also:Indian Students: విదేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఐదేళ్లలో 403 మంది మృతి

1991లో మణిపూర్‌లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది. 1991 నాటి ఆ ఉత్తర్వును ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఏటా కనీసం రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఈ విషయంపై అవగాహన ఉన్న ఓ అధికారి తెలిపారు. మద్యం అమ్మడం లేదా తాగడంపై నిషేధం ఉన్న అన్ని రాష్ట్రాల్లో మద్యం ద్వారా భారీ ఆదాయాన్ని కోల్పోతున్నారు. దానికి బీహార్ ఉదాహరణ. అయితే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం మద్య నిషేధం నిర్ణయం సమాజ ప్రయోజనాల దృష్ట్యా అంటున్నారు.

Read Also:CM Revanth Reddy: కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ ఆరా.. అధికారులకు ఆదేశాలు

మణిపూర్‌లో మద్యపాన నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం నాడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నర్ ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఈ విధంగా మద్యం వినియోగం ఇప్పుడు ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైంది. మే నుంచి మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్రం నుండి అప్పుడప్పుడు హింసాత్మక నివేదికలు వస్తూనే ఉన్నాయి.

Exit mobile version