Site icon NTV Telugu

Mani Sharma : నా ‘హార్మొనీ’ దుమ్ము పట్టిపోయింది.. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్!

Manisharma

Manisharma

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘లవర్’ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరికీ మరుపురాని మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక సైలెంట్ అయ్యారు. కానీ ‘బేబీ’ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంలోని సాంగ్స్ మళ్ళీ మణిశర్మ పాత రోజులను గుర్తు చేస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా..

ఈ సినిమా ఫంక్షన్‌లో మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.. ‘నేను ఖాళీగా ఉండి ఈగలు తోలుకుంటున్న రోజుల్లో సాయి రాజేష్ వచ్చాడు. నా హార్మొనీ బాక్స్ ఎక్కడ ఉందో కూడా నేను మర్చిపోయాను. కానీ రాజేష్ వెతికి మరి దానిని బయటకు తీసి, దుమ్ము దులిపి నా చేతికి ఇచ్చి ట్యూన్స్ చేయించుకున్నాడు’ అంటూ మణిశర్మ ఎమోషనల్ అయ్యారు. తనలోని టాలెంట్‌ను మళ్ళీ గుర్తించి, తన సంగీతానికి ప్రాణం పోసిన సాయి రాజేష్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక పక్కా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’తో.. మణిశర్మ బాక్సాఫీస్ వద్ద తన మ్యూజికల్ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజంట్ మణి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version