Site icon NTV Telugu

Mandous Cyclone : తెలంగాణకు వర్ష సూచన.. రాగల 3 రోజులు జాగ్రత్త

Rains 1

Rains 1

Mandous Cyclone : తెలంగాణలో అక్కడక్కడ రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి.. సాయంత్రం వాయుగుండంగా, ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రకటించారు.

Read Also: Bangladesh Agitations: బంగ్లా ప్రధానిపై తీవ్ర అసహనం.. రాజీనామా చేయాలంటూ వీధుల్లోకి వచ్చిన జనం

ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని వెల్లడించారు. మరోవైపు మాండూస్‌ తుపాను ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మబ్బులు పట్టాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది. ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, బషీర్ బాగ్, లక్డీ కపూల్‌, నాంపల్లి, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. మాండూస్ ప్రభావం సందర్భంగా వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version