NTV Telugu Site icon

Mandous : మొదలైన మాండుస్‌ బీభత్సం.. భారీ వర్షం.. తీర ప్రాంతాల్లో అలర్ట్‌..

Nellore

Nellore

మాండోస్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై పడింది. తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులు కురుస్తుండడంతో రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం రాశులు కల్లాల్లోనే ఉండడంతో వాటిని మిల్లులకు తరలించే పనిలో పడ్డారు. వర్షం ఎక్కువ అయితే రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. మరోపక్క మారిన వాతావరణం ఆక్వా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ఇబ్బంది కారంగా మారింది. జిల్లాలో పరిస్థితి పై మా రిపోర్టర్ మల్లికార్జున మరింత సమాచారం అందిస్తారు.

Also Read : Etela Rajender: ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదు

నెల్లూరు జిల్లా మైపాడులో ఎగసి పడుతున్న అలలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కావలి.. కోవూరు.. నెల్లూరు.. వెంకటాచలం.. గూడూరు.. సూళ్లూరుపేట.. నాయుడుపేట.. వెంకటగిరి.. తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా తీరంలో సముద్రం పది మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది. నెల్లూరు జిల్లాలో తుఫాను పరిస్థితి పై మైపాడు బీచ్ నుంచి మా ప్రతినిధి అమర్ నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు..