మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు.1970 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోంది. వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..ఈ సినిమా తరువాత రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతున్నట్లు సమాచారం.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానున్నట్లు సమాచారం. అలాగే రీసెంట్ గా దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమాను కమిట్ అయ్యాడు.
రీసెంట్ గా ఆ సినిమాను మేకర్స్ అనౌన్స్ కూడా చేసారు. ఇలా వరుస సినిమాలతో బిజీ గా వున్న రవితేజ తరువాత సినిమా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.రవితేజ తన తరువాత సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతుందని సమాచారం.మాస్ కా దాస్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో బేబీ సినిమా నిర్మాత ఎస్కెయన్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కలర్ ఫోటో చిత్రంతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో విలన్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతోందని సమాచారం.ఈ పాత్ర కోసం మంచు మనోజ్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్ ఈ ముగ్గురి కాంబినేషన్ ఎలాగైనా సెట్ అయ్యేలా ఎస్ కె ఎన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.మంచు మనోజ్ సినిమా కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఆయన హీరో గా అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు..మరి ఈ సినిమాలో విలన్ పాత్రకి ఒప్పుకుంటారో లేదో చూడాలి.