Site icon NTV Telugu

Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ

Manchu Family

Manchu Family

Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలైంది. పహడీషరీఫ్‌ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్‌ ఫిర్యాదు చేశాడు. వినయ్‌ అనే వ్యక్తిపై కూడా మనోజ్‌ ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు. ప్రధానంగా విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read Also: Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో అగ్నిప్రమాదం

ఇదిలా ఉండగా.. తెలంగాణ హైకోర్టులో మోహన్‌ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్‌ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

 

Exit mobile version