మంచు మనోజ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 26న, అంటే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మనోజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో మెగా యాక్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది.
Also Read : ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి
“BRUTAL ERA BEGINS” (ఒక భీకరమైన శకం మొదలవుతోంది) అంటూ మనోజ్ పెట్టిన క్యాప్షన్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి, ఫైట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, హ్యాష్ ట్యాగ్‌లు చూస్తుంటే మనోజ్ ఈసారి మాస్ అండ్ వయోలెంట్ లుక్‌లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. మరి రిపబ్లిక్ డే రోజున రాబోయే ఆ ‘ఫస్ట్ లుక్’ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
