మంచు మనోజ్ రెండో పెళ్ళిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి రోజు వచ్చినప్పుడు నేనే చెప్తానన్నారు మనోజ్.డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్. 2019 లో భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి అడపాదడపా మంచు మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే వున్నాయి. ఈ వార్తలకు తెర దించుతూ మంచు మనోజ్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే.. భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ రోజు వెల్లడించాడు. గత మూడేళ్ల నుంచి సింగిల్ స్టేటస్ మెయిన్ టేన్ చేస్తున్న మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నాడో ఇంకా వివరాలు తెలపలేదు. మంచిరోజు వచ్చినప్పుడు అన్ని విషయాలు తానే చెబుతానన్నాడు సొట్టబుగ్గల మనోజ్.
Manchu Manoj Comments on Second Marriage Live: రెండో పెళ్లిపై మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
Show comments